రాయదుర్గం: మారెంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి, తీవ్రంగా గాయపడిన కొడుకు
రాయదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై మారెంపల్లి వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గం మండలం ముదిగల్లుకు చెందిన రమేష్ (55) మృతిచెందగా, కుమారుడు గజేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. వీరు ఆటోలో రాయదుర్గం వస్తుండగా మాధవి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.