గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో బహిరంగంగా చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని కమిషనర్ రమణబాబు వెల్లడి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని కమిషనర్ రమణ బాబు ప్రజలను హెచ్చరించారు. అంతేకాకుండా శనివారం పట్టణంలోని పలు ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులను సిబ్బంది ఏర్పాటు చేశారు. నిరంతరం చెత్త వేసి మురికిగా మారుస్తున్న ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచే విధంగా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.