కొండపి: టంగుటూరు మండలంలో స్కై ప్రాజెక్టు ద్వారా డ్రోన్ ఎగరవేసి నిర్మానుష ప్రదేశాలను పరిశీలించిన పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో గురువారం పోలీసులు స్కై ప్రాజెక్టు కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్మానుష ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉంటే ప్రాంతాలను పరిశీలించామని పేకాట కోడి పందాలు అలానే ఈవ్ టీచింగ్ వంటి అంశాలపై ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానంతో దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.