రాయదుర్గం: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ పట్టణంలో సిపిఎం నిరసన
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలపై భారాలు మోపడం తగదని ఆ పార్టీ జిల్లా కమిటి సభ్యులు మల్లికార్జున, సీనియర్ నాయకులు నాగరాజు మండిపడ్డారు. ధరలు తగ్గించేవరకూ ఉద్యమిస్తామన్నారు.