మార్కాపురం: జిల్లాలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రవత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వడగాలులు ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. రానున్న వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల వద్దనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.