మణుగూరు: రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన రామవరం విద్యార్థిని హర్షిక: జాతీయ స్థాయికి ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని జె. హర్షిక అథ్లెటిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయులు, అధికారులు అభినందించారు.