యర్రగొండపాలెం: పోతంపల్లికి వెళ్లే రహదారి గుంతలమయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వెల్లడి
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం పోతంపల్లికి వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాలలో రాకపోకలు కష్టంగా మారుతుందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన రహదారి నిర్మించాలని కోరారు.