రాయదుర్గం: పట్టణంలో తాగునీటి సమస్య పై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సోమవారం అనంతపురంలో మున్సిపల్, విద్యుత్ అధికారులతో సమీక్షించారు. కనేకల్లు ఎస్‌ఎస్ ట్యాంక్‌లో నీరున్నా 5 రోజులకోసారి కూడా సరఫరా కావడం లేదని, 15 కి.మీ దూరం నుంచి విద్యుత్ వల్ల పంపింగ్‌కు అంతరాయమని అధికారులు చెప్పారు. కనేకల్లు సబ్‌స్టేషన్ నుంచే నేరుగా విద్యుత్ ఇవ్వాలని, పాలిమర్ ఇన్సులేటర్లు అమర్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రూ.30 లక్షలతో 15 రోజుల్లో పనులు పూర్తిచేస్తామని ఈఈ చక్రవర్తి హామీ ఇచ్చారు. ఎస్ఈ శేషాద్రి, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.