యర్రగొండపాలెం: రాజంపల్లి గ్రామంలో వెలిసిన గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలిసిన గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.స్వామి అమ్మవారికి విశ్వక్సేన, సంప్రోక్షణ పుణ్యాహవచనం తదితర పూజలను అర్చకులు భవాని ప్రసాద్ చేశారు. ఇవాళ గజవాహనం సందర్భంగా ఎడ్లు బండలాగు పోటీలను ప్రారంభిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. రేపు రథోత్సవం రథోత్సవం జరుగుతుందని భక్తులు పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.