రాయదుర్గం: పట్టణంలో క్లీన్ స్వీప్ లో బాగంగా పరక పట్టి రోడ్డు ఊడ్చిన మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి
బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్, ప్రధాన రోడ్లు,పార్కులు తదితర ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సూచించారు. ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేయడం, చెత్త వేయడం లాంటివి మానుకోవాలని, కోరారు. మన రాయదుర్గాన్ని స్వచ్ఛంగా, అందంగా ఉంచడంలో మున్సిపల్ సిబ్బందికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో భాగముగా శనివారం రాయదుర్గం పట్టణంలోని 18 వార్డు సచివాలయం పరిధిలో ఆయన స్వయంగా శ్రమదానం చేశారు.