యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలం చట్లమిట్ల గ్రామ సమీపంలో చనిపోయిన గేదెను తప్పించబోయి చెట్టును ఢీకొన్న సూపర్ లగ్జరీ బస్సు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్ల సమీపంలో నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కు పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున రోడ్డుపై చనిపోయి ఉన్న గేదెను ఢీకొని అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో స్వల్ప గాయాలతో సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారు. బస్సు డ్రైవర్ స్టీరింగ్ లో చిక్కుకోవడంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని శ్రమించి బయటకు తీశారు. గాయపడిన వారినందర్నీ మార్కాపురం వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ కు ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.