దర్శి: దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రానైట్ క్వారీలో అధికారులు తనిఖీలు
Darsi, Prakasam | May 29, 2026 ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి చెందిన గ్రానైట్ క్వారీలో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో గ్రానైట్ క్వారీలో నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలను జరిపారని అధికారులు నోటీసులు జారీ చేశారు. 25 వేల క్యూబిక్ మీటర్ల మేర అక్రమ మైనింగ్ పాల్పడినట్లు నోటీసులో పేర్కొన్నారు. చీమకుర్తిలో మరెన్నో క్వారీలు ఉండగా ఎమ్మెల్యే క్వారీ పైన దాడులు చేయడం రాజకీయ చర్చకు దారి తీసింది.