తాడిపత్రి: యాడికి లో ఈనెల 6న సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో అనువైన స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆనంద్
యాడికి లో ఈనెల 6న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఎస్పీ జగదీష్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డ్ ను పరిశీలించారు. పలు అనువైన స్థలాలను పరిశీలించారు. అనంతరం యాడికి కాలువను కూడా పరిశీలించారు. సీఎం పర్యటన కు పక్కగా ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు.