మార్కాపురం: టిడిపి కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షణ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఆయనకు అందజేశారు. కొన్ని సమస్యలను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పరిష్కరించారు. మిగిలిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి అర్జీని ప్రాధాన్యతలను బట్టి పరిష్కరించడం జరుగుతుందన్నారు.