దర్శి: బొద్దికూరపాడు గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించడంతో పడిపోయిన కరెంటు స్తంభాలు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో విపరీత ఈదురుగాలుల వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. బొద్దికూరపాడు గ్రామంలో కరెంటు స్తంభాలు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు విద్యుత్ స్తంభాలు తొలగించి పునరుద్ధరణ పనులను చేపట్టారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి విద్యుత్ అంతరాయం కలిగిందని స్థానికులు తెలిపారు.