కొండపి: పొన్నలూరు మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి హాజరై లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.