యర్రగొండపాలెం: దేవరాజు గట్టు లో గేదలను దొంగతనం చేస్తున్న ఇద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్కు అప్పగించిన బాధితుడు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు ఎస్సీ కాలనీకి చెందిన ఇమ్మానియేల్ రెండు గేదెలను ముగ్గురు దొంగతనం చేశారు. గేదెలను వెతుకుతున్న సమయంలో ఓ పెట్రోల్ బంకు సమీపంలో ఆటోలో ఎక్కిస్తూ కనిపించారు. వారిని పట్టుకోగా ఒకరు పారిపోయారు. బద్వేలుకు చెందిన ఇద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్లు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.