మార్కాపురం: మార్కాపురం జిల్లా పరిసర ప్రాంతాలలో నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమాణాలు విధించిన పోలీసులు
మార్కాపురం జిల్లా పరిసర ప్రాంతాలను శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలను పాటిస్తూ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనదారులు వాహన సంబంధిత ధ్రువపత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.