గిద్దలూరు: అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, ముగ్గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి గాయాల పాలయ్యాడు. రజిత అనే మహిళపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరినీ కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటి ముందు శుభ్రం చేసుకునే విషయంలో తలెత్తిన వివాదం వల్ల ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.