కనిగిరి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెప్మా రిసోర్స్ పర్సన్లు వినియోగించుకోవాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉదర నర్సింహారెడ్డి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్ లకు శనివారం ట్యాబులను, బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆధునిక సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెప్మా రిసోర్స్ పర్సన్లు వినియోగించుకొని పట్టణ పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబులను, బయోమెట్రిక్ మిషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెప్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.