కొండపి: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొని తన వివరాలు నమోదు చేసుకున్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలు తామే నమోదు చేసుకోవచ్చని మంత్రి అన్నారు. ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి చెప్పారు. మే 1 నుంచి అధికారులు అప్లికేషన్లు వెరిఫికేషన్ చేస్తారని మంత్రి అన్నారు.