కొండపి: టంగుటూరు లోని 16 నెంబర్ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్, తీవ్ర అవస్థలు పడ్డ వాహనదారులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండల పరిధిలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై వాహన రద్దీ నెలకొంది. ఆదివారం టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి టోల్ ప్లాజాన్ని దాటి వెళ్లేందుకు వాహనదారులు అవస్థలు పడ్డారు. వేసవి సెలవులు కావడం, అందులో ఆదివారం తో పాటు నిత్యం వాహనాల పెరిగిపోవడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాహనదారులు అంటున్నారు. నిమిషాల వ్యవధిలో టోల్ ప్లాజాన్ని దాటవలసి ఉన్న గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.