కొండపి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసిన కొండపి వైసిపి ఇన్చార్జ్ మాజీ మంత్రి ఆదిమల సురేష్
కూటమి ప్రభుత్వం తక్షణమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయాలని మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మార్కాపురంలో జరిగిన వైసీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తున్నారని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని మాజీ మంత్రి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తవుతుందని తాను నమ్మడం లేదన్నారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ఆగస్టులో ప్రాజెక్టు నుండి నీళ్లు విడుదల చేస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.