కొండపి: సింగరాయకొండ కందుకూరు ఫ్లై ఓవర్ సమీపంలో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్లిన లారీ, డ్రైవర్ కి స్వల్ప గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కందుకూరు ఫ్లై ఓవర్ సమీపంలో లారీ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్ళింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్ర మత్తుతో వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. మరో ప్రమాదం జరగకుండా పోలీసులు స్టాపర్లు ఏర్పాటు చేసి జాగ్రత్తలు పడ్డారు.