యర్రగొండపాలెం: పుల్లల చెరువు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆగస్టు ఏడవ తేదీ జరుగుతుందని ఎంపీడీవో మరియదాసు వెల్లడి
మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆగస్టు ఏడో తేదీ జరుగుతుందని ఎంపీడీవో మరియదాసు తెలిపారు. ఎంపీపీ కందుల వెంకటయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని అన్ని పంచాయతీల ప్రత్యేక అధికారులు ప్రాదేశిక సభ్యులు అన్ని శాఖల అధికారులు తగు నివేదికలతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. హాజరు కాని వారిపై చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.