గిద్దలూరు: మార్కాపురం జిల్లాలో పసుపు రైతులకు గిట్టుబాటు ధర లేక ఆవేదన, ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్న పసుపు రైతులు
మార్కాపురం జిల్లాలో పసుపు రైతుల పరిస్థితి దారుణంగా తయారయింది. సరైన గిట్టుబాటు ధరలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. కంభం, బేస్తవారిపేట పరిసర ప్రాంతాలలో రైతులు వందల ఎకరాలలో పసుపు పంట వేశారు. ఎకరాకు రూ.2 లక్షలు వరకు పెట్టుబడి వస్తుందని ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం తమకు ఎటువంటి లాభాలు రావని రైతులు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా పసుపు పంట వేసిన రైతులు పంటను అమ్ముకోకుండా తమ వద్ద ఉంచుకున్నారని ప్రస్తుతం ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పసుపు రైతు పూర్తిగా కుదేలవుతారని రైతులు తెలిపారు. ప్రభుత్వం ముందుకు వచ్చి పసుపు పంటను పండించిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరు