మార్కాపురం: పొదిలి మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వడగండ్ల వాన
మార్కాపురం జిల్లా పొదిలి మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. మరోవైపు విపరీతమైన వడగండ్లు పడ్డాయి. మండలంలోని కంబాలపాడు సమీపంలో రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎస్ఐ రాజేష్ కుమార్ సంఘటన ప్రాంతానికి చేరుకొని జెసిబి సహాయంతో రోడ్లపై చెట్లను తొలగించారు.