దర్శి: దర్శిలో జరిగిన రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Darsi, Prakasam | Apr 25, 2026 ప్రకాశం జిల్లా దర్శిలోని అద్దంకి రోడ్డులో రాత్రి ఒకేచోట 2 ప్రమాదాలు జరిగాయి. పొగాకు లోడుతో వెళ్తున్న బొలెరో ఆటోను ఢీకొట్టింది. ఆ ఘటన చోటుచేసుకున్న కొద్దిసేపటికే అదే ప్రాంతంలో రోడ్డు దాటుతున్న లారీని అతివేగంగా వచ్చిన మరో బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న ఆటో, బొలెరో వాహనాల్లోని ఇద్దరికి తేలికపాటి గాయాలయ్యాయి. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.