మార్కాపురం: అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నియోజకవర్గంలో చేసిన సంక్షేమం అభివృద్ధిని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వివరించారు. మార్కాపురంలో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 31,894 మంది లబ్ధిదారులకు 330 కోట్ల 55 లక్షలు , తల్లికి వందనం 23వేల,96 మంది విద్యార్థులకు 28 కోట్ల ఏడు లక్షలు అన్నదాత సుఖీభవ 32 వేల 965 మందికి 65 కోట్ల 93 లక్షల రూపాయలు ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు.