కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేలకు డ్రోన్ సహాయంతో పర్యవేక్షిస్తున్న పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ సహాయంతో పోలీసు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు డ్రోన్ ఎగరవేసి క్షుణ్ణంగా ప్రతి ప్రాంతాన్ని పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలతో పాటు కోడిపందాలు పేకట ఆడే వాటిని కనిపట్టేందుకు డ్రోన్ ఎగరవేశామని గతంలో అటువంటి సంఘటనలు డ్రోన్ సహాయంతో గుర్తించిన విషయాన్ని తెలిపారు. ఇటీవల చోరీలు కూడా పెరిగిన నేపథ్యంలో చోరీల అంశాలపై కూడా నిఘా పెట్టామన్నారు.