కొండపి: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 35 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి స్వామి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందినందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.19 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి అన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని మంత్రి అన్నారు.