రాయదుర్గం: పట్టణంలోని బైపాస్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద కూలిపోయిన రైల్వే సేఫ్టీ ఐరన్ బీమ్
రాయదుర్గం పట్టణంలోని బైపాస్ రోడ్డులో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన సేఫ్టీ ఐరన్ బీమ్ కుప్పకూలి విరిగి పడింది. మంగళవారం తెల్లవారుజామున వడ్ల లోడుతో వెళుతున్న లారీ తగిలి కింద పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఈ భీమ్ పిల్లర్ తో సహా ఊడి పడటం నాణ్యత లేకపోవడం బహిర్గతం చేస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.