యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామంలో ఏడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మూడు డీప్ బోర్లను టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు ప్రారంభించారు. అదేవిధంగా పిడికిటి వారి పల్లి గ్రామంలో 5 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన మినీరాల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.