మార్కాపురం: కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం వద్దిమడుగు గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో గ్రామస్తులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చౌటపాలెం మెయిన్ రోడ్డు నుండి వద్దిమడుగు గ్రామానికి వెళ్లాలంటే సరైన రోడ్డు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని వాహనదారులు అన్నారు. మట్టి రోడ్డులో వర్షాకాలం ఏదైనా వాహనం ఇరుక్కున్నదంటే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది అన్నారు. కొన్ని సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొన్నది అన్నారు.