కళ్యాణదుర్గం: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కంబదూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా
కంబదూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. కంబదూరు లోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన నిర్వహించారు. గత 15 రోజులుగా తాగునీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ, మండల పరిషత్ అధికారులకు విన్నవించిన పట్టించుకోలేదన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు.