మార్కాపురం: నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసీన్
మార్కాపురం జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏఐటియుసి ఏరియా మహాసభలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరారు. ఏప్రిల్ 1వ తేదీ బ్లాక్ డే గా పాటిస్తున్నట్లు తెలిపారు.