రాయదుర్గం: పట్టణంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత :ఎమ్మెల్యే
*రాయదుర్గం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు* రాయదుర్గం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఏ పట్టణానికీ తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 11వ వార్డులో రూ.10 లక్షలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులకు ఆయన భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే, పట్టణంలో సుమారు రూ.20 కోట్లతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.