యర్రగొండపాలెం: కృషి పట్టుదల ఏకాగ్రత విజయానికి మార్గాలుగా చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో పదవ తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలిచిన మహతాబ్ ను జిల్లా కలెక్టర్ విజయ సునీత కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఏకాగ్రత పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. కృషి పట్టుదల ఏకాగ్రత విజయానికి మార్గాలుగా చేసుకోవాలన్నారు. అలసిపోకుండా నిరంతరం లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు.