కళ్యాణదుర్గం: కంబదూరులో రికార్డులు సక్రమంగా లేని 17 ద్విచక్ర వాహనాలు, ఒక టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
కంబదూరు మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు శనివారం విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని 17 ద్విచక్ర వాహనాలు తో పాటు ఒక టాటా ఎస్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై లోకేష్ కుమార్ మాట్లాడారు. వాహనదారులందరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలను పాటించడంతోపాటు సరైన రికార్డులను కలిగి ఉండాలన్నారు. రికార్డులు సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పలు ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.