రాయదుర్గం: నియోజకవర్గంలో భక్తిశ్రద్దలతో బక్రీద్ వేడుకలు జరుపుకున్న ముస్లిం లు
రాయదుర్గం నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు జరిగాయి. గురువారం ఉదయమే పట్టణంలోని కణేకల్లు రోడ్డు, బళ్ళారి రోడ్డులోని ఈద్గా ల వద్దకు వేలాది మంది ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగ ప్రత్యేకతలు వివరించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కణేకల్లు, డి.హిరేహాల్ లోనూ బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.