కొండపి: పాత సింగరాయకొండలో గత నెల 30వ తేదీన మృతి చెందిన రాహుల్ మృతి పై అనుమాన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలోని బావిలో గత నెల 30వ తేదీన అనుమానాస్పద రీతిలో మృతి చెందిన రాహుల్ కేసులో కొత్త మలుపు. రాహుల్ తండ్రి రాజేశ్వర్ తన కొడుకుది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. గత నెల 27వ తేదీన కాచిగూడలో బీటెక్ చదువుతున్న రాహుల్ అదృశ్యమయ్యాడని, 30వ తేదీన బావిలో శవమై కనిపించాడని తెలిపారు. తన కొడుకు మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని రాజేశ్వర్ పోలీసులను వేడుకుంటున్నారు.