యర్రగొండపాలెం: పుల్లలచెరువులో వేషదారుడు బుజ్జయ్య సర్పంచి బోర్డు మెడలో తగిలించుకొని వినూత్న ప్రచారం
రాజకీయాల్లో ఎన్నికల హామీలు మేనిఫెస్టోలు కొత్త కాదు. అయితే ఓ సామాన్యుడు వినూత్నంగా ఆలోచించి పండగ వేళ నవ్వులు పూయిస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. పుల్లలచెరువులో మొహరం పండుగ వేడుకల సందర్భంగా స్థానిక వేషదారుడు బుజ్జయ్య తన మెడలో కాబోయే సర్పంచి బోర్డు తగిలించుకొని ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో అందజేశారు. ప్రతి ఇంటికి ఒక కేజీ బంగారం, అబ్బాయికి చదువు అమ్మాయికి వివాహం నా బాధ్యత అంటూ మ్యానిఫెస్టో అందజేశారు.