మార్కాపురం: జిల్లా కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలు
అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయాన్ని కార్యకర్తలు ముట్టడించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్డిఓ వెంకట శివరాం రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి రూబెన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అంగనవాడి కార్యకర్తలు వేతనాల పెంపు కోసం 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. ఆ సమయంలో అంగన్వాడి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ సమస్యలు పరిష్కరించలేదన్నారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నార.