మార్కాపురం: విద్యానగర్ లో కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్న స్థానికులు
మార్కాపురం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పోతుల బెడద తీవ్ర రూపం దాల్చింది. నిరంతరం మిద్దెలపై తిరుగుతూ అదను చూసి ఇండ్లలోకి స్వర పడుతున్న కోతులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వస్తువులను చిందరవందర చేయడమే కాకుండా అడ్డుకో పోతే మనసుల పైకి దాడికి దిగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.