గిద్దలూరు: గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాలలో జూలై 15వ తేదీ బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడి
మార్కాపురం జిల్లా గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాలలో జూలై 15వ తేదీ బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు వ్యవసాయ గృహ సంబంధిత విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.