కనిగిరి: ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ లో ఆగస్టు చివరి వారం వరకు చేపలు వేటను నిషేధించిన అధికారులు
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్లో ఆగస్టు చివరి వారి వరకు చేపల వేటను నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. చేపల సంతాన ఉత్పత్తిని పెంపొందించుకునే సమయం కాబట్టి ఎవరు కూడా చేపలు పట్టవద్దని హెచ్చరించారు. అలా కాదని ఎవరైనా చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని జాలర్లను అధికారులు హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.