మార్కాపురం: గోగులదిన్నె గ్రామంలో నిరుపయోగంగా మారిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం
ఇండ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను వృధాగా పరివేయకుండా దానిని రీసైకిల్ చేసి విలువైన ఉత్పత్తులుగా మార్చడానికి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు. మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేసిందో అందుకు భిన్నంగా నిరుపయోగంగా మారింది. వేలలో ఖర్చుపెట్టి నిర్మించిన తొట్టెలు ప్రయోజనం లేకుండా పోయాయి.