దర్శి: దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన మాజీ సీఎం జగన్
Darsi, Prakasam | Jun 28, 2026 వైసిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని బాధ్యతలు అప్పగించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రెసిడెంట్ గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి ఈ కమిటీలు చోటు కల్పించారు.