దర్శి: దర్శి ఎంపీడీవో కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మంత్రి వంగలపూడి అనిత
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆనందింప చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.