కొండపి: గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులను ప్రశంసించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలు వసతి గృహాల్లో 10th, ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవార్డులు నగదు ప్రోత్సాహక బహుమతులు మంత్రి స్వామి శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందజేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యార్థులకు అవార్డులు, ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్య ద్వారానే పేదరికం జయించగలమని అన్నారు. లోకేశ్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తుచేశారు.